![]() |
![]() |
.webp)
సర్కార్ సీజన్ 4 నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి సత్యభామ మూవీ టీమ్ ఎంట్రీ ఇచ్చింది. నవీన్ చంద్ర, చందమామ కాజల్ వచ్చారు. ఇక కాజల్ వేసిన సరదాగా వేసిన సెటైర్స్ కి సుధీర్ ఫుల్ ఫిదా ఐపోయాడు. అలాగే కాజల్ తన బిడ్డను హగ్ చేసుకుని ఉన్న టీ షార్ట్ వేసుకుని కాజల్ ని ఫుల్ ఫిదా చేసేసాడు. కాజల్ స్టేజి మీద ఎంట్రీ ఇవ్వగానే చిన్నపిల్లలంతా కలిసి ఫ్లవర్స్ ఇచ్చి ఇన్వైట్ చేశారు. ఇక సుధీర్ కూడా తాను చిన్నపిల్లాడినంటూ కాజల్ కి చాక్లెట్ ఇచ్చాడు. తర్వాత కాజల్ కి షేక్ హ్యాండ్ ఇచ్చేసరికి షాక్ కొట్టినట్టు చేతిని వెనక్కి తీసేసుకున్నాడు.
మగధీరలో సీన్ లా చేసాడు. "మనది ఈ జన్మ బంధం కాదనుకుంటున్న 500 ఇయర్స్ బ్యాక్ జన్మ అనుకుంటా..గుర్రాలు, వంద మందితో ఫైట్ " అని సుధీర్ గుర్తు చేసేసరికి కాజల్ తనకు ఏదో గుర్తొచ్చినట్టు "కాలకేయ" అంటూ పిలిచింది. దాంతో షాకైపోయాడు. "మీరు ఇంట్లో చందమామ, సత్యభామ" అని సుధీర్ అడిగేసరికి "నీల్ తో చందమామ, గౌతమ్ తో సత్యభామ" అని చెప్పింది. ఆ తర్వాత "నా నుంచి మీకొక సర్ప్రైజ్ " అంటూ సుధీర్ స్టేజి మీద కాస్త అటు ఇటు నడిచి చివరికి కాజల్ తన బేబీని ఎత్తుకున్న ఇమేజ్ తో ప్రింట్ చేసిన టీ షర్ట్ వేసుకొచ్చేసరికి కాజల్ ఫుల్ ఖుషీ ఐపోయింది. "సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటి మేడం" అని అడిగేసరికి "ఏసిపి సత్యభామ" అని చెప్పింది. "బయట కూడా మీరు ఏసిపినే కదా" అన్నాడు సుధీర్. "ఎలా" అని కాజల్ అడిగేసరికి "అందమైన క్యూట్ పిల్ల" అనే డైలాగ్ చెప్పాడు. దాంతో నవ్వేసింది కాజల్.
![]() |
![]() |